వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు మెరుగైన విజయావకాశాలు ఉన్న నేపథ్యంలో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ టాస్ నెగ్గిన వెంటనే బ్యాటింగ్ అంటూ ఉత్సాహంగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇక టీమిండియాలో కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ జట్టులోకి రాగా, న్యూజిలాండ్ జట్టులో సౌథీ బదులు లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చాడు.