YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్షేమ పథకాలు రద్దు అవుతున్నాయి

సంక్షేమ పథకాలు రద్దు అవుతున్నాయి

కృష్ణాజిల్లా  నూజివీడు  మండలం సీతారాంపురం పట్టిసీమ కాలువ వంతెనపై జలహారతి కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమానికి  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ జలవనరు శాఖా మంత్రి దేవినేని ఉమా,  జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్  గద్దె అనురాధ ,  మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ , మాజీ యమ్.పీ కొనకళ్ల నారాయణ, గన్నవరం యమ్.యల్.ఏ వల్లభనేని  వంశీ  నూజివీడు గన్నవరం నియోజకవర్గాల టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.
గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని  వంశీ మాట్లాడుతూ ఆల్మట్టి ప్రభావంతో కృష్ణా నదిలో నీళ్లు ఎండిపోయాయి. రైతులకు ఎకరాకు 40లక్షలు నష్టపరిహారం అందించాం. -పట్టిసీమ వలన మెట్టప్రాతంలో చెరువు నింపుకున్నారు. పోలవరం మరో 3సంవత్సా రాలకు కుడా జగన్ పూర్తిచేయలేరు. గత నాలుగు సం,,నుండి పట్టుసీమ వలనే లబ్ది పొందుతున్నామని అన్నారు. పట్టుసీమ వలన ఉపయోగం లేదని ఉప్పుడు నీళ్లు వదిలారు. అంటే ఉపయోగం ఉందనేగా అర్థం.చైనా మోటార్లు వెస్ట్ అన్నారు.ఇప్పడు అవే ఉపయోగిస్తున్నారు. రైతులకు 500 మోటార్లు ఉచితంగా అందజేయటానికి నేను సిద్ధమని అన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం రోజు పట్టుసీమకు శ్రీకారం చుట్టాం. పోలవరం 4 నుంచి 5ఏళ్లు   పడుతుందని చంద్రబాబు పట్టుసీమ ను ప్రారంభించారు. అప్పుడు జగన్ పట్టుసీమ దండగ అన్నాడు. -కర్నూలు జలదీక్ష సభలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఇండియా పాకిస్థాన్ గొడవలు వస్తాయని కాళేశ్వరం ప్రారంభానికి వెళ్ళాడని అన్నారు. పోలవరం సందర్శించి ఏతప్పు పట్టుకోలేకపోయాడు. పట్టుసీమ వలన44వేల కోట్లరూపాయల ఆదాయం పెరిగింది. సోషల్ మీడియా పట్టుసీమపై జగన్ ని ప్రశ్నించింది. కీయా కార్ల కంపెనీ చంద్రబాబు వలనే వచ్చింది.   ఎన్నికల్లో అవకతవకలు జరిపి ఓడించారని ఆరోపించారు. ప్రస్తుతం నదువుతుంది ఏ ప్రభుత్వం అని ప్రజలని ప్రశ్నించి ఇవియం ప్రభుత్వం అని చెప్పించారని అన్నారు.
 నారా లోకేష్  మాట్లాడుతూ -చంద్రబాబు 5నెలల్లో పట్టుసీమ పూర్తిచేశారు. అప్పుడు చంద్రబాబు అడిగారు జగన్ ని పట్టుసీమ పై అభిప్రాయం. జగన్ వ్యతిరేకం అని వాకౌట్ చేశారు.  పట్టుసీమ రాయలసీమకు కూడా ఒక వరం. -పట్టుసీమ దండగ అని  వక నెల ఆలస్యంగా నైనా నీళ్లు వదిలారు. ముఖ్యమంత్రి యూ టర్న్ తీసుకుంటున్నారు. అమ్మవడి పథకం పై స్పష్టత లేదని అన్నారు. రాష్ట్రంలో విత్తనాల కొరత బాగా ఉంది.ఏమంటే చంద్రబాబు తప్పు అంటారు. పెన్షన్ 3వేలు ఇస్తానని ఇప్పడు దశలవారి అంటున్నారు. నిరుద్యోగ భృతి,అన్న క్యాంటీన్,పసుపు కుంకుమ రద్దయ్యాయి. నవరత్నాలలో వకటికూడా పూర్తిగా అమలుచేయలేదు. చంద్రబాబు పెన్షన్ 1000 నుంచి 2000 వేలు చేశారు. జగన్ 250 మాత్రమే పెంచారు.  క్రికెట్ లో వికెట్లు పడినట్లు సంక్షేమ పథకాలు అన్ని అవుట్ అయిపోతున్నాయని అయన విమర్శించారు.

Related Posts