YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

19 రాష్ట్రాల్లోని 110 నగరాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు

19 రాష్ట్రాల్లోని 110 నగరాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు

 యువ్  న్యూస్ జనరల్ బ్యూరో:

 అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది సీబీఐ. మంగళవారం నాడు  ఏకకాలంలో 110 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి హడలెత్తించింది.  30 కేసులకు సంబంధించి 19 రాష్ట్రాల్లో .. 110 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి.  ప్రధానంగా అవినీతి, ఆయుధాల స్మగ్లింగ్ ఆరోపణలపై విసృతంగా గాలించాయి.  సీబీఐ దాడులతో నేర ప్రవృత్తి కలిగిన వ్యాపారులు బెంబేలెత్తిపోయారు.  పక్కా ప్రణాళికతో ఏకకాలంలో 110 చోట్ల దాడులు చేయడంతో బిత్తరపోయారు. ఢిల్లీ, ముంబై, లుధియానా, థానె, వాల్సాడ్, పుణె, పలానీ, గయా, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్ ఇతర చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు.  16 కేసుల్లో మోసపూరిత సొమ్ము రూ.1100 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.  ఈ కేసుల్లో వివిధ కంపెనీలు, సంస్థలు, ప్రమోటర్లు, డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు, ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. బ్యాంకులకు రూ.13 వేలకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో నక్కిన నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ ఉదంతం .. కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.  దీంతో మిగతా ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని దాడులు చేయిస్తున్నట్టు విశ్వసనీయం సమాచారం.

Related Posts