YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏపీకి హోదా ఇవ్వాల్సిందే

Highlights

  • మనమంతా ఒక్కటైతే 
  • మోడీ మెడలు వంచవచ్చు
  • టీడీపీ-వైసీపీలకు
  • ఆంధ్రుల ఆత్మ గౌరవ సభలో 
  • రాహుల్ గాంధీ పిలుపు 
ఏపీకి హోదా ఇవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో మనమంతా ఒక్కటన్నఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలునిచ్చారు. దీనితో హోదా కోరుతూ ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేస్తున్న ఏపీ అధికార,ప్రతిపక్ష పార్టీలకు పెద్ద అండ దొరికినట్లయింది. ఏపీకి న్యాయం కోసం దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోన్న విషయం తెలిసిందే. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిపోయిది. విభజన హామీలు నెరవేర్చేవరకు పోరాటం ఆపేది లేదని ఏపీ ఎంపీలు కేంద్రానికి గట్టి హెచ్చరికలు పంపారు. పార్లమెంటు బయట, వెలుపల టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా అయినప్పటికీ ముగ్గురు ఒకే అంశంపై ఆందోళన చేయడం సరికొత్త రాజకీయ పరిణామానికి నాంది ప్రస్థానంగా పేర్కొనవచ్చు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విభజన హామీల అమలుపై కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు. కేంద్రం న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు స్ట్రీట్‌లో నిర్వహించిన ఆంధ్రుల ఆత్మ గౌరవ సభకు హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేం మొదట చేసే పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అని రాహుల్ గాంధీ అన్నారు. మనమంతా ఒక్కటిగా ఉంటే ప్రభుత్వం, మోడీ మెడలు వంచవచ్చునని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు మోడీ కచ్చితంగా అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.


.
 

Related Posts