YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇది రౌడీ రాజ్యమా.. ప్రజాస్వామ్యమా మేము రౌడీయిజం చేస్తే మీరెక్కడ ఉండేవారు :చంద్రబాబు

 ఇది రౌడీ రాజ్యమా.. ప్రజాస్వామ్యమా   మేము రౌడీయిజం చేస్తే మీరెక్కడ ఉండేవారు :చంద్రబాబు

  యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులను ఆపాలని హెచ్చరించారు. రాజీనామా చేయాలని అంగన్‌వాడీ టీచర్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ కార్యకర్తల ఆగడాలను తూర్పారబట్టారు. కాంట్రాక్టర్లు, కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది రౌడీ రాజ్యమా  ప్రజాస్వామ్యమా ? మేము రౌడీయిజం చేస్తే మీరెక్కడ ఉండేవారు. మా కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా. ఇకపై వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. కడప విమానాశ్రయం నుంచి తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చేరుకొని  హత్యకు గురైన తెదేపా కార్యకర్త భాస్కర్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటాం. తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచిపద్ధతి కాదు. ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పైనా దాడి చేశారు. ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పైనా దౌర్జన్యానికి పాల్పడ్డారు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కార్యకర్తలను కాపాడు కోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వైకాపా నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. తెదేపాకు సహకరించిన ప్రజలపై కూడా వైకాపా దాడులు చేస్తోందన్నారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియాపైనా దాడులకు దిగి పత్రికా స్వేచ్ఛను రిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, దాడులు చేయడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు హితవు పలికారు.

Related Posts