కాళేశ్వర గంగ పొంగుతున్నది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహానికి అనుగుణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్‌హౌ స్ వద్ద జలాల ఎత్తిపోత క్రమేణా పెరుగుతున్న ది. ఆదివారం వరకు రెండు మోటర్లతో నీటిని ఎత్తిపోసిన ఇంజినీర్లు.. సోమవారం మధ్యా హ్నం 12.09 గంటలకు మూడో నంబర్ మో టర్‌ను కూడా ప్రారంభించారు. ఒక్కోమోటర్ రోజుకు 2100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండటంతో కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్ ద్వారా మూడు మోటర్ల నుంచి రోజుకు సు మారు 6,300 క్యూసెక్కుల నీరు అన్నారం బరాజ్‌కు చేరుతున్నది. నిర్విరామంగా నీటిని ఎత్తిపోస్తుండటంతో గ్రావిటీ కెనాల్ నీటితో నిండుగా కనబడుతున్నది. గ్రావిటీ కాల్వ ద్వా రా గోదావరి నీరు 13.34 కిలోమీటర్లు ప్రయాణించి అన్నారం బరాజ్‌కు చేరుతుంది. సోమవారం సాయంత్రం వరకు 0.6 టీఎంసీల నీరు అన్నారం బరాజ్‌లోకి చేరినట్లు సాగునీటిశాఖ ఇంజినీర్లు వెల్లడించారు. కన్నెపల్లి పంపుహౌస్ మోటర్లలో ఆరింటిని గోదావరి జలాల ఎత్తిపోతకు ఇంజినీర్లు సిద్ధంచేశారు. వీటిలో ఆరో మోటర్ వెట్న్‌న్రు గత జూన్ 21వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది నుంచి వరదనీరు గోదావరిలోకి వస్తున్నది. దీనితో ఆ నీటిని ఎత్తిపోసేందుకు ఒకదాని తర్వాత ఒకటిగా మోటర్లను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే 1, 3, 6వ నంబర్ మోటర్లు నిరంతరం గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నాయి. వీటికితోడు మంగళవారం నాలుగో నంబర్ మోటర్‌ను ప్రారంభించారు. తదుపరి దశల్లో ఐదోనంబర్, రెండో నంబర్ మోటర్లను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు. మంగళవారం నుంచి మొత్తం నాలుగు మోటర్లతో నిరంతరం గోదావరి జలాల ఎత్తిపోత కొనసాగనుంది.