YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మేడి పండు చందం..త్రిపుర ఎన్నిక

Highlights

ఇది మన ప్రజాస్వామ్యం..
ఎర్రకోటలో కాషాయం విజయం 

మేడి పండు చందం..త్రిపుర ఎన్నిక

త్రిపుర లో కమలనాధులు సాధించిన ఓట్లు ... 9,79,376 గెలిచిన స్దానాలు..35 లను సొంతం చేసుకుంది. ఇక్కడ అధికారాపేక్షమైన సిపిఎంకు వచ్చిన ఓట్లు..9,75,221 కాగా 16 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొద్దున్న ఓట్లు కేవలం 4,155 (బిజెపి,సిపియం ల మద్య ఓట్ల తేడా కేవలం..4,155 ) మాత్రమే. ఈ మాత్రం దానికే కాషాయం మిడిసిపాటు. అది పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శనం లెనిన్ విగ్రహం కూల్చివేత. ఓట్ల శాతాన్ని పక్కపెడితే ఇరు పార్టీల మధ్య పొందిన సీట్ల తేడా మాత్రం.19  స్థానాలున్నాయి.
కేవలం 4,155ఓట్లు అదనంగా వచ్చినందుకు గానూ 19 ఎమ్మెల్యే  సీట్లు అదనంగా బిజెపి గెలవగలిగింది. ఈ గణాంకాలతో కూడిన కధనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదండీ  మన ఎన్నికల మాయాజాలం..
అందుకే ప్రతీ ఓటు విలువ లెక్కింప బడేది, అభ్యర్డి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేని
దామాషా  ఎన్నికల విధానం  దేశంలో అమలు చేయాలని ప్రజాస్వామ్య వాదులు కోరుకుంటున్నారు..

Related Posts