YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల పవిత్రతను సుసంపన్నం చేయాలి !

తిరుమల పవిత్రతను సుసంపన్నం చేయాలి !

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేసేందుకు కృషి చేయాలని గవర్నర్ నరసింహన్  సూచించారు. మంగళవారం విజయవాడ వచ్చిన గవర్నర్ ను గేట్ వే హోటల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ... మీ గురించి విన్నాను ! నిత్యం భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తుంటారట గదా !  మీ హయాంలో తిరుమల దేదీప్యమానంగా వెలుగొందుతుందని భావిస్తున్నట్లు వ్యక్తం చేశారు. భక్తులకు సాధ్యమైనంత తక్కువ సమయంలో దర్శనమయ్యేట్లు చూడాలని కోరారు. టీటీడీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సుబ్బారెడ్డి గవర్నర్ కు తెలియజేశారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడం.. కొండపై రద్దీ తగ్గించేందుకు భక్తులకు కొండ కిందనే వసతి కల్పన.. ఇంకా నూతన పాలక మండలి తీసుకోనున్న నిర్ణయాలను గవర్నర్ కు సుబ్బారెడ్డి వివరించారు.

Related Posts