యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నాయకుడు అంటే జనాన్ని కదిలించేవాడు. జనాన్ని అనుసరించేవాడు మాత్రం కాదు, కన్నీరు తుడుస్తూనే అవసరమనిపించినపుడు కఠినంగా కూడా ఉండే వాడు. ఇక తన దారి రహదారి అయినపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికీ జంకాల్సిన అవసరం అంతకంటే లేదు. వై.ఎస్. జగన్ విషయానికి వస్తే నెల రోజుల పాలనపై ఆయన గర్వంగా చెప్పుకున్నారు. తాను ఎన్ని పనులు చేసానన్నది జనాలకు విడమరచి చెప్పగలుగుతున్నారు. అలా చెబుతున్నపుడు జగన్లో ఆత్మవిశ్వాసం, కళ్ళలో గర్వం తొంగి చూస్తున్నాయి. చెప్పింది చేయడం, దాని కోసం ఎంత దాకైనా వెళ్ళడం జగన్ కే చెల్లింది.ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ లో మరో గొప్ప గుణం ఇచ్చిన మాటను తప్పకపోవడం. ఓ విధంగా ధైర్యం కూడా కనిపిస్తోంది. ఇంతవరకూ ఏ నాయకుడు చేయని విధానం ఇది. ఇప్పటివరకూ దేశం చూసిన నాయకుల్లో ఏ సమస్య అయినా, లేక ఏ ప్రాజెక్ట్ విషయమైనా కూడా తమ వద్దకు వచ్చినపుడు చేద్దామని ముందు చెబుతారు. మరీ వత్తిడి వుంటే టెంటెటివ్ గా ఫలానా సమయమని చెబుతారు. కానీ జగన్ అలా కాదు డేట్స్ ఫిక్స్ చేసి మరీ చెప్పేస్తున్నారు. ఇలా చెప్పాలంటే దానికి విజన్ కావాలి. ఆలాగే గుండె నిండా ధైర్యం కూడా కావాలి. ఒకవేళ ఆ రోజున ఆ పని జరగకపోతే జనానికి జవాబు చెప్పుకోవాల్సివుంటుంది. అంటే కచ్చితంగా తాను ఆ టైం కి ఆ పని చేసి చూపిస్తానన్న ధీమా ఉండడం వల్లనే జగన్ ఇలా ప్రకటించగలుగుతున్నారనుకోవాలి. దీనికి ముందస్త్ ప్లాన్, పక్కా వ్యూహం ఉంటేనే తప్ప సాధ్యపడదు. జగన్ ప్రమాణ స్వీకారం నుంచి ఇలా డేట్ ఫిక్స్ చేసి చెప్పడం అంతే వేగంగా ఆ డేట్స్ ప్రకారం వాటిని అమలు చేయడం జరుగుతోంది.ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ ఆగస్ట్ 15 నాటికల్లా గ్రామ వాలంటీర్లు అన్నారు వై.ఎస్.జగన్. దానికి కసరత్తు స్టార్ట్ అయిపోయింది. ఇక అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అంటున్నారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా అని జగన్ ప్రకటించారు. . ఇపుడు కడపలో స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన డిసెంబర్ 26న అని జగన్ లేటెస్ట్ గా డేట్ ఫిక్స్ చేశారు. అలాగే అదే రోజు జిల్లాలో కొన్ని నీటి ప్ర్జాజెక్త్టులకు కూడా శంకుస్థాపన అని జగన్ ప్రకటించారు. మొత్తం మీద చూస్తే జగన్ గట్స్ ని చూసి ట్రడిషనల్ పొలిటీషియన్లే కాదు, ఆ ధోరణికి అలవాటు పడిన అధికారులు కూడా ఆశ్చర్య పోవాల్సివస్తోంది. మొత్తానికి జగన్ ఇపుడు కొత్త ట్రెండ్ ని అనుసరిస్తున్నారు. ప్రజలు కూడా ఉత్త హామీలు పట్టించుకోవడంలేదు. జగన్ లాంటి వారు దాన్ని గుర్తించి డేట్ టైం అన్నీ చూసుకుని మరీ హామీలు ఇచ్చేస్తున్నారు. ఇపుడు రాబోయే తరం నేతలకు ఇది ఓ విధంగా సవాల్ గా మారనుంది.