యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు జల కళ సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో చర్ల మండలం తో పాటు సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తాలి పేరు ప్రాజెక్టు లో వరద నీరు వచ్చి చేరింది. . దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరిగి 72 మీటర్లకు చేరుకుంది. మరో రెండు మీటర్లు నీరు చేరితే 74 మీటర్లు కు చేరుకుంటుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం పూర్తి అయితే మూడు మండలాల పొలాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ప్రాజెక్టు లీకు .... వృధాగా పోతున్న నీరు తాలిపేరు ప్రాజెక్టు లో పూర్తిస్థాయి గేట్లు దింపి ఉన్నప్పటికీ గేట్లు మధ్య నుండి కారి నీరు వృధాగా పోతుంది. లీకై పోవడం వలన ప్రాజెక్టులో మీరు నిల్వ ఉండే అవకాశం తక్కువ ఉంటుందని. రైతులు
ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు లు గేట్ల మధ్యలో లీకులకు మరమ్మతులు చేపట్టి నీరు వృధాగా పోకుండా చూడాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు