యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ మళ్లీ మొదలైంది. మాంచెస్టర్ లో వర్షం వల్ల మంగళవారం అంతరాయం ఏర్పడగా, ఇవాళ రిజర్వ్ డేలో ఆటను కొనసాగించారు.ఓవర్లన్నీ ఆడిన కివీస్ చివరికి 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగుల చేసింది. రాస్ టేలర్ తన ఓవర్ నైట్ స్కోరుకు మరో 7 పరుగులు జోడించి 74 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రనౌట్ గా వెనుదిరిగాడు.