యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
సెమీఫైనల్ లో 240 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే కష్టాల్లో పడింది. కేవలం 5 పరుగుల స్కోరుకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (1)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మను మాట్ హెన్రీ అవుట్ చేయగా, కోహ్లీని ట్రెంట్ బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. డీఆర్ఎస్ లో కూడా కోహ్లీ అవుట్ అని తేలడంతో టీమిండియా శిబిరం నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 1 పరుగుకే అవుటయ్యాడు.