యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడలో నవ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పిక్కిలి రామకాశయ్య(22), చంద్రకళ(19)లరే రెండు నెలల క్రితం మే 23 న
వివాహం జరిగింది. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది. ఊరికి పరిసర ప్రాంతంలోని ముస్తఫా సామి దర్గా ప్రాంతంలోని ఓ పొలంలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఈ నవదంపతుల ఆత్మహత్య అనుమానస్పదం గా ఉంది భార్య కు గాయాలై రక్తస్రావం జరిగింది. ఈ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన పై విచారణ చేపట్టిన గిద్దలూరు యస్.ఐ. సమందర్ వలి కేసు నమోదు చేసి. విచారణ చేపట్టారు.