యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ ను ఏర్పరిచి సరిగ్గా నెలన్నర కూడా కాకముందే.. అప్పుడే కొంతమంది మంత్రులను తప్పించనున్నారనే వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. అవినీతి రహిత పాలననే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి… అవినీతి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే వారిని కేబినెట్ నుంచి తప్పించడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతూ ఉంది.జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ ఉన్నారు.. అవినీతిని సహిందచేది లేదని జగన్ బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. తొలి కేబినెట్ భేటీలో కూడా జగన్ మోహన్ రెడ్డి ఇదే విషయాన్నే చెప్పడం గమనార్హం. అవినీతి ఆరోపణలు వచ్చి ఎవరైనా వాటిల్లో తల దూర్చారని నిర్ధారణ అయితే క్షమించే ప్రసక్తే లేదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేస్తూ వచ్చారు.తన పార్టీ ఎమ్మెల్యేలకు నేతలకు మంత్రులకు అందరికీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ వచ్చారు జగన్. అయితే కొందరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని సమాచారం. జగన్ అంతగా చెబుతున్నా కొంతమంది అవినీతి వ్యవహారాలను చేస్తున్నట్టుగా జగన్ కు పక్కగా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. అందుకే వారిపై చర్యలు తీసుకోవడానికి సీఎం ఫిక్సయినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఆ జాబితాలో ఒక మహిళా మంత్రి కూడా ఉందని సమాచారం. ఆమెకు మంత్రి పదవి దక్కడమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. శాఖ వ్యవహారాల్లో ఆమె భర్త జోక్యం ఎక్కువగా ఉండటంతో ఆమెపై చర్యలు ఉండవచ్చని టాక్.ఇక తన సొంత జిల్లాకు అంతా తనే పెద్ద అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఒక సీనియర్ మంత్రిపై కూడా జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇక ఒక ధర్మబద్ధమైన శాఖకు మంత్రిగా ఉంటూ..రెండు కోట్ల రూపాయల లంచం వ్యవహారంలో చేతులు చాచాడట ఒక మంత్రి. ఆయనపై కూడా చర్యలు తప్పవని వార్తలు వస్తున్నాయి. ఇక ఒక విద్యాలయం సీజ్ ఓపెనింగ్ కు సంబంధించి ఒక మంత్రిపై చర్యలు తప్పవని టాక్. అలాగే తన శాఖలో అప్పుడే ఒక కాంట్రాక్టుకు సంబంధించి అవినీతి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై కూడా జగన్ చర్యలకు సిద్ధం చేస్తున్నట్టుగా వినికిడి.ఇలా పాతిక మందిలో అప్పుడే ఐదు మందికి ఫైనల్ వార్నింగ్ప్ పూర్తి అయ్యాయని.. వారిపై చర్యలకు జగన్ సిద్ధం అవుతూ ఉన్నారని రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది!