Highlights
- మహేశ్ అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి
- ఏప్రిల్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు
- వన్స్ మోర్ అనిపిస్తున్న డైలాగ్స్
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో నిర్మితమవుతున్న 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించి మంగళవారం విడుదలైన టీజర్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రెండు రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు వదులుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో మహేశ్ మాట్లాడుతున్నట్టుగా ..ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనే ఆలోచన చేస్తున్నట్టుగా .ప్రజలతో చర్చిస్తున్నట్టుగా వున్న ఈ పోస్టర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ రెండు రోజులుగా కూడా 'ది విజన్ ఆఫ్ భరత్'ను ఆవిష్కరించనున్నట్టు చెప్పిన విధంగానే కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'ది విజన్ ఆఫ్ భరత్' అంటూ.. . ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. డీవీవె దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.
" చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది .. ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పొద్దని .. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది .. చాలా కష్టమైంది. ఎంతకష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్లకి భయం .. బాధ్యత ఉండాలి. అంటూ ,మహేశ్ చెప్పిన డైలాగ్స్ వన్స్ మోర్ అనిపిస్తున్నాయి.
యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ వీడియోలో మహేశ్ గతంలో కన్నా గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియోతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. డీవీవె దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.