YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం

Highlights

  • శ్రీ వల్లీ దేవసేన సమేత
  • సుబ్రహ్మణ్య స్వామి ఆలయం
  • మల్లాం , నెల్లూరు జిల్లా 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం

మల్లాం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చిట్టమూరు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గూడూరు నుండి 48 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, రథోత్సవం కన్నుల పండువగా జరుగును

షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి.

 ప్రధాన గాధ 
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి

• షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
• స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
• కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
• వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
• శరవణభవుడు - శరములో అవతరించినవాడు
• గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
• సేనాపతి - దేవతల సేనానాయకుడు
• స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
• సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
• మురుగన్ - అందమైన వాడు (తమిళం)

దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు.
జై శ్రీమన్నారాయణ 
  

Related Posts