యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమల శ్రీవారి ఆలయ భదత్రా విభాగంలో సెక్యూరిటీ గార్డుల నియామకం జరుగుతోందని సామాజిక మాధ్యమాల్లో కొందరు విడుదల చేసిన ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని టిటిడి తెలియజేస్తోంది. ఇలాంటి ప్రకటనలు చూసి నిరుద్యోగులు మోసపోవద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. సదరు ప్రకటనలు జారీ చేసిన భీమల విజయకృష్ణనాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సదరు వ్యక్తి ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9652177776 ద్వారా జరుగుతున్న మోసపూరిత ప్రచారంపై టిటిడి నిఘా విభాగం విచారణ చేపడుతోంది. సామాజిక మాధ్యమాల్లో టిటిడి ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయదు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గుర్తించాలని టిటిడి కోరుతోంది.