యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొలిమిగుండ్ల మండలం గొర్వ్రిమాన్ పల్లె గ్రామంలో బుధవారం రాత్రి టిడిపి- వైసిపి వర్గీయులు రాళ్లు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ టిడిపి, వైసిపి వర్గీయులు రాళ్లు విసురుకోవడం తో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ల దాడిలో టిడిపి నాయకుడు రామేశ్వర్ రెడ్డి కి చెందిన ఇన్నోవా కారు ధ్వంసం అయింది. దాడిలో లో టీడీపీ - వైసీపీ వర్గీయులు గాయపడ్డారు .. గాయపడినవారిని బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఇరువర్గాలు ఘర్షణ సమయంలో పోలీసులు ఉన్నప్పటికీ టిడిపి వైసిపి వర్గీయులు ఏమాత్రం తగ్గకుండా రాళ్లు విసురుకోవడం చూస్తే గ్రామంలో కక్షలు ఏ స్థాయిలో ఉన్నాయో అని అర్థం చేసుకోవచ్చు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో అప్పుడు పలువురికి గాయాలు అయ్యాయి..
వైసిపి నాయకులు దాడులకు పాల్పడుతున్నారు
- మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు... బుధవారం రాత్రి దాడి కి గురైన డోరేమాన్ పల్లె రామేశ్వర్ రెడ్డి నీ అసలు కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు .. కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి జరిగిన ఘటనపై సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు కి ఫిర్యాదు చేశారు.. వైసిపి నాయకులు వరుస దాడులకు పాల్పడుతూ టిడిపి కార్యకర్తలను అంతమొందించేందుకు కుట్రపన్నుతున్నారని .. పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్న అని ఆందోళన వ్యక్తం చేశారు... శిలాఫలకాలు ధ్వంసం చేయడం.. టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడం నియోజకవర్గంలో ఎక్కువయ్యాయని గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు