YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భక్తులకు అందుబాటులోకి పద్మనాభ నిలయం

భక్తులకు అందుబాటులోకి పద్మనాభ నిలయం

తిరుమలలోని ఆర్టిసి బస్టాండ్ వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయమైన పద్మనాభ నిలయంను గురువారం నుండి భక్తులకు కేటాయించేందుకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. రిసెప్షన్-2 ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  కె.పార్వతి, ఎస్ఇ -2 రామచంద్రరెడ్డి ఈ మేరకు పూజలు నిర్వహించి భక్తులకు కేటాయించారు.
 ఇదివరకు ఈ సముదాయంలో  శ్రీవారి సేవాసదన్ కార్యాలయం నిర్వహించేవారు. ఇటీవల శ్రీవారి సేవకులకు కల్యాణవేదిక వెనుక వైపు నూతన  శ్రీవారిసేవా సదన్ను ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా పద్మనాభ నిలయంలో టిటిడిలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో 3 విశాలమైన హాళ్లు ఉన్నాయి.  దాదాపు 816 లాకర్లు, బెడ్షీట్లు, దిండ్లు, తాగునీరు, ఎల్ఇడి టివిలు, డిస్ప్లే బోర్డులు, స్త్రీలు, పురుషులకు వేరువేరుగా 70 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 51 మంది పారిశుద్ద్య సిబ్బంది 3 షిప్టులలో విధులు నిర్వహిస్తారు.   పద్మనాభ నిలయంలో పూజల అనంతరం బెంగుళూరుకు చెందిన శ్రీ వినయ్కు మొదటి లాకర్ కేటాయించి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చారు.  

Related Posts