యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రోజూ బస్కీలు (పుష్ అప్స్) చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. రోజూ కనీసం 50 నుంచి 100 బస్కీలు తీయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, బస్కీలు తీయడమంటే మాటలు కాదు. మొత్తం శరీరాన్ని చేతులపై మోయాలి. అయితే, ఈ బాలుడు మాత్రం వేల సంఖ్యలో బస్కీలు తీస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు.
రష్యాకు చెందిన ఆరేళ్ల బాలుడు ఇబ్రహిం ల్యానవ్ బస్కీలతో రష్యా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. 2 గంటల వ్యవధిలో నిర్విరామంగా 3,270 బస్కీలు తీసి అబ్బురపరిచాడు. ఈ సందర్భంగా ‘చింగిజ్’ స్పోర్ట్స్ క్లబ్ ఇబ్రహిం కుటుంబానికి పూర్తిగా ఒక అపార్టుమెంటునే బహుమతిగా ఇచ్చేసింది. 2018లో ఇబ్రహిం తరహాలోనే ఐదేళ్ల బాలుడు రక్హిం కురయేవ్ 4,105 బస్కీలు తీసి మెర్సిడెస్ కారును గెలుచుకున్నాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్హింకు కారు తాళాలు ఇచ్చారు.