YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దిగాలుగా కనిపించిన చంద్రబాబు

దిగాలుగా కనిపించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసెంబ్లీ సమావేశాల్లో దిగులుగా కన్పించారు. ఆయన సభలో ముభావంగా ఉన్నారు. తనపై అధికార పక్షం చేస్తున్న విమర్శలను సయితం చంద్రబాబునాయుడు సావధానంగా విన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేస్తున్న విమర్శలను ఆసక్తిగా గమనించారాయన. అంతేకాకుండా తనపై విమర్శలు చేసినా ఐదు కోట్ల ఆంధ్రప్రజలు కోసం సహిస్తానని చెప్పుకురావడం విశేషం.చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి తనను తిరిగి గెలిపిస్తాయని నమ్మారు. తనకున్న అనుభవాన్ని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని అంచనా వేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలయ్యారు. కేవలం 23 మందిని మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఈ అపజయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్షానికి బలం మామూలుగా లేదు. 151 మంది సభ్యుల బలంతో అధికార పక్షం చంద్రబాబునాయుడును అడుగడుగునా సభలో అడ్డుకుంటోంది. హరికృష్ణ మృతి చెందినప్పుడు శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయం చేయలేదా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించినప్పుడు కూడా చంద్రబాబునాయుడు చూస్తూ కూర్చున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చ జరుగుతున్నప్పుడు మాత్రం తన అనుభవమంత లేదు వయసు అని జగన్ ను సూటిగా చంద్రబాబునాయుడు దెప్పిపొడిచారు.బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు చంద్రబాబునాయుడును చూసిన వారెవరికైనా కొంత బాధకలగక మానదు. ఆరుపదుల వయసులో ప్రత్యర్ధి పార్టీలోని జూనియర్లు సయితం తనపై మాటల దాడి చేస్తుంటే చంద్రబాబు చేష్టలుడిగి చూస్తున్నారు. ఒక్క అచ్చెన్నాయుడు మినహా మిగిలిన సభ్యులు ఎవరూ అధికార పక్ష సభ్యుల విమర్శలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మొత్తం మీద చంద్రబాబునాయుడు తొలి రోజు సమావేశంలో చంద్రబాబునాయుడు దిగాలుగా కన్పించారు.

Related Posts