YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

సమగ్ర నేరస్తుల సర్వేకు శ్రీకారం

 సమగ్ర నేరస్తుల సర్వేకు శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర​ వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే గురువారం ప్రారంభం అయింది. పదేళ్లలో పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాళ్ల ఇళ్లకు అధికారులు, సిబ్బంది వెళ్లి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ సర్వేలో కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల అధికారులు పాల్గొన్నారు.

ప్రతి నేరస్తుడి సమాచారం, వారి ఇళ్లనూ జియో ట్యాగింగ్‌ చేసి టీఎస్‌ యాప్‌ పొందు పరచనున్నారు. గురువారం సర్వే పూర్తి కాని నేపథ్యంలో పూర్తయ్యే వరకు కొనసాగుందని, ప్రతి నేరస్తుడి ఆచూకీ కనిపెట్టి వివరాలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సకల నేరస్థుల సమగ్ర సర్వే నిర్వహిస్తున్న పోలీసులు. సమగ్ర సర్వేలో భాగంగా ఎల్బీనగర్, వనస్దలిపురం, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్  పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రాంతాలలో నేరాలు చేస్తున్నపలువురిని పోలీసులు గుర్తించి సర్వే నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్ - 951, వనస్దలిపురం -728, హయత్ నగర్ - 537, అబ్దుల్లా పూర్ మెట్ -124

సెంట్రల్ జోన్ పరిధిలో
2008 నుంచి సౌత్‌ జోన్‌ పరిధిలో 2269 మంది పాత నేరస్థుల ఉన్నట్టు గుర్తించారు. చిక్కడపల్లి -334, ముషీరాబాద్ -520, గాంధీనగర్ - 283, సైఫాబాద్ - 224, నాంపల్లి - 170, రాం గోపాల్ పేట్ - 70, అబిడ్స్- 123, నారాయణ గూడ - 229, బేగం బజార్ -165. మంది నేరస్థులున్నారు.

సైబరాబాద్ పరిధిలో.. 20,000 మంది

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20,000 మంది నేరస్థులున్నారు :  మాదాపూర్ జోన్ డిసిపి విశ్వప్రసాద్ . 
ప్రజలకు  బరోసా కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేస్తుందని  నేరస్థుల పూర్తి  వివరాలను అందుబాటులో ఉంచేందుకు అదే విధంగా వారి కదలికలను అనుక్షణం  నిఘాపెట్టె విధంగా నేరస్థుల సమగ్ర సర్వే చేపట్టాం : విశ్వప్రసాద్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జోన్ల   వారిగా నేరస్థుల సమాచారం తమ దగ్గర ఉందన్నారు.

మాదాపూర్ జోన్ లో మొత్తం 6,000 మంది నేరస్థులు.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 454 మంది నేరస్థులు ఉన్నారు.

 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 232 మంది నేరస్థులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 235 మంది ఉన్నట్లు సమాచారం.

 కూకట్ పల్లి  పోలీస్ స్టేషన్ పరిధి లో 1311 కెపి హెచ్ బి  పోలీస్ స్టేషన్ పరిధి లో 983 నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 738 మంది ఉన్నారు.

 మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 717 చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 601 రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 523

బచూపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తక్కువగా 193 నేరస్థులు :

ఖమ్మంలో..

ఇప్పటి వరకూ సమగ్ర కుటుంబ సర్వే... సమగ్ర భూముల సర్వే నిర్వహించిన తెలంగాణా ప్రభుత్వం తాజాగా సమగ్ర నేరస్తుల సర్వేకు
సమగ్ర నేరస్తుల సర్వేకు చుట్టింది. రాష్ట్ర డిజిపి స్థాయి అధికారి నుండి సామాన్య కానిస్టేబుల్ వరకూ ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పాత నేరస్థుల ఇంటికే నేరుగా వెళ్లి వారి గత నేర చరిత్ర...ప్రస్తుత జీవన శైలిని ప్రత్యక్షంగా తెలుసుకుని రికార్డుల్లో నమోదు చేసేందుకే సమగ్ర నేరస్తుల సర్వే నిర్వహిస్తున్నామని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ చెబుతున్నారు..

Related Posts