యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
బాలీవుడ్ సినీనటి సోనాక్షి సిన్హా 2018వ సంవత్సరంలో స్టేజి ప్రదర్శన ఇచ్చేందుకు రూ.24 లక్షలు తీసుకొని కార్యక్రమానికి రాలేదని నిర్వాహకులు యూపీలోని కట్‌ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సినీనటి సోనాక్షిసిన్హాపై యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేశారు. ఛీటింగ్ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఓ పోలీసు బృందం గురువారం సాయంత్రం ముంబైలోని సోనాక్షిసిన్హా ఇంటికి వచ్చింది. పోలీసులు వచ్చినపుడు సోనాక్షిసిన్హా ఇంట్లో అందుబాటులో లేదు.