యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎక్కువగా ఒక్క మాటే వినపడుతుంది. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై విరుచుకుపడాల్సిన సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫార్టీ ఇయర్ ఇండ్రస్ట్రీ అయితే ఉపయోగం లేదని, సంస్కారం ఉండాలని ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి మరోసారి చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు గతంలో తన అనుభవం గురించి పదే పదే చెప్పుకున్న పదాన్నే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎద్దేవా చేస్తూ సభలో ఉపయోగిస్తున్నారు.ఏపీ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ముఖ్యమంత్రి..వైసీపీ నేతలు ముప్పేట దాడి చేసారు. సీఎం జగన్ గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను ఎండగడుతూ దీనికి ఆధారంగా అధికారులు రాసిన లేఖలు..నాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా సభలోనే ప్రదర్శించారు. ఇక..సీనియర్ మంత్రులు.. ఎమ్మెల్యేలు పంచ్‌లతో టీడీపీ మీద రాజకీయ దాడి చేసారు. అచ్చెన్నాయుడును సీఎం జగన్ వదల్లేదు. శరీరం పెరిగింది కానీ..బుర్ర పెరగలేదంటూ కామెంట్ చేసారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మాటల యుద్దాలతో మార్మోగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబుల సవాళ్లు... ప్రతి సవాళ్లు... హీటెక్కిస్తున్నాయి...అంబటి..అనిల్..పెద్దిరెడ్డి నేరుగా చంద్రబాబును ఉద్దేశించి వేసిన పంచ్‌లతో సభలో కొత్త వాతావరణం కనిపించింది. ప్రాంతీయ బోర్డు ఛైర్మన్ లకు క్యాబినెట్ హోదా కల్పించనున్న సీఎం జగన్ సభలోనే స్క్రీన్ ప్రజెంటేషన్.. ముఖ్యమంత్రి జగన్ కరువు మీద ప్రకటన చేసే సమయంలో ఈ పరిస్థితికి చంద్రబాబు కారణమంటూ ఆధారాలను సభ లో ప్రదర్శించారు. అధికారులు విత్తనాల కోసం చెల్లించాల్సిన సొమ్మును విడుదల చేయాలంటూ నాటి ముఖ్యమంత్రి కి రాసిన లేఖలను స్క్రీన్ పైన సభలో జగన్ ప్రదర్శించారు. రైతు రుణ మాఫీ విషయంలో ఎన్నికల సమయంలో ఏం చెప్పారు..ముఖ్యమంత్రిగా ఏం చెప్పారనే భిన్న వ్యాఖ్యలను సైతం సభలోనే ప్రదర్శించారు. తన ప్రసంగానికి మద్యలో అడ్డు తగిలిన అచ్చెన్నాయుడు మీద పంచ్ వేసారు. శరీరం పెరిగింది కానీ..ఇంత కూడా బుర్ర పెరగలేదంటూ వ్యాఖ్యానించారు. ఇక.. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సైతం వయసు తో పాటుగా హుందాతనం పెరగాలని జగన్ సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సున్నా వడ్డీ మీద మాట్లాడే విషయంలో నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నిలదీసారుసీఎంతో పాటు....మంత్రులు సైతం అదే బాటలో.. కాళేశ్వరం ప్రాజెక్టు.. కరువు మీద చర్చ సమయంలో మంత్రి అనిల్ సినిమా డైలాగ్‌లతో చెలరేగారు. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు అని చేసిన కామెంట్ మీద అనిల్ స్పందించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు..ఎప్పుడు వచ్చారు కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేదే విషయం అని వ్యాఖ్యానించారు. ఇక, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం మాట్లాడారు. సీఎం జగన్ కరువు నివారణ కోసం ప్రతీ ఎమ్మెల్యేకు కోటి రూపాయాలు ఇస్తున్నామని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం ఇస్తామని ప్రకటించారు. దీంతో..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలం అందరం కలిసి నియోజకవర్గ నిధుల కోసం వెళ్తే ఇవ్వమని చెప్పారని..ఇప్పుడు జగన్ ను చూసి అయినా టీడీపీ నేతలు అభినందించాలని సూచించారు.చంద్రబాబు తన హయాంలో జీరో వడ్డీ చెల్లించారా లేదా చెప్పాలని ముఖ్యమంత్రి ..ఆర్దిక మంత్రి డిమాండ్ చేసారు. ఆ సమయంలో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. జోక్యం చేసుకున్న అంబటి రాంబాబు వ్యంగంగా చంద్రబాబు పైన విమర్శలు చేసారు. తన హాయంలో జీరో వడ్డీ చెల్లించలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసని.. అయితే, పక్కనే ఉన్న అచ్చంనాయుడు..పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు తెలిసీ తెలియని సమాచారంతో చంద్రబాబును సభలో ముంచుతారని వ్యాఖ్యానించారు. వైసీసీ ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ ఇలా అధికార పార్టీ చేస్తే..చంద్రబాబు రక్తం మరిగిపోదా అండీ అంటూ చేసిన కామెంట్‌తో సభలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. అటు సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ టెర్రరిజం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. జగన్ అహంభావిగా ప్రవర్తిస్తున్నారన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వడ్డీతో సహా చెల్లించామని చెప్పారు. తెలుగుదేశం పార్టీని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సున్నా వడ్డీ అంశం చర్చ సందర్భంగా అరుపులు, కేకలతో సభ దద్దరిల్లుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సున్నా వడ్డీ పథకానికి గత టీడీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెబుతూ... నన్ను రాజీనామా చేయాలని సవాల్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో సిగ్గు లేకుండా నవ్వుతున్నారని అన్నారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్ చేశామని చెప్పారుముఖ్యమంత్రి ఎందుకు అంత పరుషంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నన్ను రాజీనామా చేసి వెళ్లిపొమ్మంటారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా గాడిదలు కాశారా అంటారా? అని మండిపడ్డారు. సున్నా వడ్డీ పథకంపై అన్ని వివరాలను సభ ముందు ఉంచుతామని... అప్పుడు జగన్ రాజీనామా చేస్తారా? లేక క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారుముఖ్యమంత్రి జగన్ సభా సాక్షిగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. సున్నా వడ్డీ పధకం కింద చంద్రబాబు రూపాయి కూడా చెల్లించలేదని నిరూపిస్తానని..చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ సవాల్ చేసారు. దీని మీద వైసీపీ నేతలు సైతం టీడీపీని నిలదీసారు. జీరో వడ్డీ కింద చెల్లించిన లెక్కలను సభ ముందుంచారు. ఆ తరువాత జగన్ సైతం తన లెక్కల్లో చంద్రబాబు సున్నా వడ్డీ కింద చేసిన చెల్లింపులను చెప్పటం ద్వారా..తాను చేసిన వాదన తప్పని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కనిపించింది. అయితే, ఇవ్వాల్సింది ఇవ్వకుండా విదిలింపులు చేస్తే చెల్లించినట్లా అంటూ ప్రభుత్వం సమర్ధించుకొనే ప్రయత్నం చేసింది. చంద్రబాబు టీం మాత్రం ముఖ్యమంత్రి ఇరుకున పడ్డారని వ్యాఖ్యానించారు. రెండో రోజు సభలోనూ అదే చర్చ.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు సున్నా వడ్డీ పైనే చర్చ సాగింది. స్పీకర్ ఆ చర్చ ముగిసిందని.. ఇక దాని పైన చర్చ ఉండదని చెప్పారుముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకొని సున్నా వడ్డీ అంశం మీద చర్చ చేపట్టాలని సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు..ఉప నేత రామానాయుడు తమ వద్ద వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి ముర ళీ ధర్ రెడ్డి ఇచ్చిన అధికారిక సమాచారం అంటూ టీడీపీ హయాంలో ఇచ్చిన సున్నా వడ్డీ లెక్కలను వివరించారు.. టీడీపీ హయాంలో మొత్తంగా 415 కోట్లు చెల్లించామని వివరించారు. దీని పైన ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. చంద్రబాబు హయాంలో చెల్లించినది ఇదీ..తొలి రోజు సభలో సున్నా వడ్డీ గురించి చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా జగన్ లెక్కలను వివరించారు. చంద్రబాబు హ యాం లో వడ్డీ లేని రుణాల కింద చెల్లించిన మొత్తానికి సంబంధించిన లెక్కలను సంవత్సరం వారీగా వివరించారు.దమ్మిడి ఇవ్వలేదు..రూపాయి ఇవ్వలేదని చెబుతూ ఉంటామని.... ప్రజలను మోసం చేసారు కాబట్టే ఈ స్థాయిలో బుద్ది చెప్పారు. జగన్ సెల్ఫ్ గోల్...ఆత్మరక్షణలో వైసీపీ ముఖ్యమంత్రి జగన్ తొలి రోజు సభలో సవాల్ చేయగా..రెండో రోజు చంద్రబాబు చెల్లించిన లెక్కలను తానే చెప్పటం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అయింది. మొత్తం చెల్లించకపోతే రూపాయి చెల్లించలే దని అంటారంటూ సమర్ధించుకొనే ప్రయత్నం చేసారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైఎస్ జగన్ సర్కార్ ను ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. తొలుత చంద్రబాబునాయుడు జగన్ పాలనను ఆరు నెలల పాటు వేచి చూద్దామని పార్టీ నేతలకు చెప్పారు. ఆరు నెలల పాటు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సి ఉంటుందని, వారి నిర్ణయాలు, విధానాలు బహిర్గతమైన తర్వాత పోరాటాలను ప్రారంభిద్దామని చంద్రబాబునాయుడు తొలుత భావించారు.అయితే తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో 23 అంశాలను చేర్చారు. ఈ 23 అంశాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకున పెట్టేవిగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని, అక్రమాలను వెలికి తీసే ఉద్దేశ్యంతోనే ఈ 23 అంశాలపై చర్చ జరపాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ధ్యేయంగా ఉన్నట్లు చంద్రబాబునాయుడు గుర్తించారు