YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్ పంటల బీమాకు రూ.1,163కోట్లు

వైఎస్సార్ పంటల బీమాకు రూ.1,163కోట్లు

రైతులకు పంట పెట్టుబడి అందించేందుకు ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకానికి ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో భారీ నిధులు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 64.06లక్షల రైతులకు లబ్ధి చేకూర్చేలా రూ.8,750కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్‌ను శుక్రవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు.బుగ్గన ప్రసంగిస్తూ..‘మే నెల చివరి వారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌కు దయనీయమైన రాష్ట్ర ఆర్థిక స్థితి స్వాగతం పలికింది. అందువల్ల ఈ ఫథకాన్ని 2020 మే నుంచి పెట్టుబడి పథకం ప్రారంభించాలనుకున్నాం. అయితే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2019, అక్టోబరు 15 నుంచి పెట్టుబడి మొత్తాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకం కింద మొత్తం 65.06లక్షల రైతులు ప్రయోజనం పొందుతుండగా, వీరిలో 15.36లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. సాగు పెట్టుబడి పథకంలో కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదే. ఈ పథకం కింద ఏటా మే నెలలోనే పంట కాలం ప్రారంభానికి రైతులకు రూ.12,500 పెట్టుబడి మద్దతు ఇస్తాం’ అని ప్రకటించారు. రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందించనుంది. దీనికోసం బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయించింది. దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేయనున్నారు.
వైఎస్సార్ పంటల బీమాకు రూ.1,163కోట్లు
అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతులు పంట నష్టపోతుంటారు. ఇలాంటి సమయంలో రైతులకు రక్షణనిచ్చేది పంట బీమా. అయితే పంట పెట్టుబడికే డబ్బులు ఖర్చయిపోవడంతో చాలామంది రైతులు బీమాను చేయించలేకపోతుంటారు. అలాంటి వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. వైఎస్సార్ పంటల బీమా పథకంగా పిలవబడే ఈ సంక్షేమ పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,163కోట్లు కేటాయించింది. దీని వల్ల 62.02లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.

Related Posts