YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనకు కామ్రేడ్స్ టాటా

 జనసేనకు కామ్రేడ్స్ టాటా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మొన్నటి ఎన్నికల్లో పోటీకి దిగేముందు కామ్రేడ్ లు తమ ప్రయాణం పవన్ స్థాపించిన జనసేన తోనే అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం, కవాతు కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. ఇక ఎన్నికల సమయంలో జనసేన జండాలకు ఉభయ కమ్యూనిస్ట్ జండాలు జతకలిశాయి. అంతకుముందు వైసిపి తో జట్టు కట్టాలనుకున్నా జగన్ ముందుకు రాకపోవడంతో చేసేది లేక జనసేన తో పొత్తు కుదుర్చుకున్నారు కామ్రేడ్ లు. అయితే కాలం కలిసి రాలేదు. జనసేన తుక్కు కింద ఓడిపోతే వారితో పాటు కామ్రేడ్ లు తుక్కు తుక్కుకింద ఫ్యాన్ గాల్లో కొట్టుకుపోయారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత ఘోరపరాజయం ప్రాప్తించడంతో కంగుతిన్నాయి వామపక్షాలు. ఓటమి సంగతి దేవుడెరుగు కనీసం డిపాజిట్లు కూడా దక్కని దిక్కుమాలిన రికార్డ్ సొంతమైంది కమ్యూనిస్ట్ లకు. దాంతో ఓటమి ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని తమదారి తాము చూసుకోవాలని కామ్రేడ్ లు యోచిస్తున్నారట. వామపక్ష నేతలు అందుకోసం పార్టీ లోని ముఖ్యులతో సమీక్ష జరిపి పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకోవాలని అధిష్టానం ఆదేశాలకొసం ఆశగా ఎదురుచూస్తున్నారు వారు.తామొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు గా వుంది కమ్యూనిస్ట్ ల స్థితి. మొన్నటి ఎన్నికల్లో అవమానకర రీతిలో తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లో పరాజయం పాలు కావడానికి పవన్ కల్యాణ్ కారణమని ఇప్పుడు కామ్రేడ్ లు ఒక అంచనాకు వచ్చేశారు. ఎలాంటి పటిష్ట వ్యూహం లేకుండా జనసేన ఎన్నికల్లో దిగి వారు మునగడమే కాకుండా తామందరిని నిండా ముంచేసిందని లెక్క తేల్చింది. ఇక అలాంటి పార్టీతో ముందుకు వెళితే తమ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందన్న ఆందోళన కమ్యూనిస్టుల్లో వ్యక్తం అవుతుంది. మొన్నటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ ల ఓట్లు బదిలీ అయినా జనసేన ఓట్లు తమ అభ్యర్థులకు బదిలీ కాకపోవడాన్ని వామపక్షాలకు భరించలేని బాధను మిగిల్చాయి. చూడాలి త్వరలో వారి నిర్ణయం ఏ దిశగా తీసుకుంటారో …

Related Posts