YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మరో రెండు రోజులు కన్నడ సంక్షోభం...

మరో రెండు రోజులు కన్నడ సంక్షోభం...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కర్ణాటక సంక్షోభం ఇంకా ముగిసేట్లు కన్పించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ “సీను” మరింత కాలం కొనసాగే అవకాశముంది. మరో నాలుగు రోజుల పాటు కర్ణాటక డ్రామా కొనసాగనుంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు.ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొద్ది క్షణాల్లో బలపరీక్షకు సిద్దమయ్యారు. గవర్నర్ ఎలాంటి జోక్యం చేసుకోకుండానే తాను బలపరీక్షకు సిద్ధమని, సమయాన్ని నిర్ణయించాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ ను కోరడం విశేషం. అయితే బలపరీక్షకు ఎప్పుడు సమయం ఇవ్వాలన్నది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీంతో కొంత సమయం సంకీర్ణ సర్కార్ కు చిక్కినట్లయింది.మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రక్షించుకునే ప్రయత్నంలో పడింది. ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేల వరకూ పార్టీని వీడి వెళ్లారు. వారు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే పార్టీకి థోకా ఇచ్చి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ను కోరింది. స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే వారు ఆరేళ్ల పాటు పోటీకి అనర్హులవుతారు.మరో వైపు యడ్యూరప్ప సయితం కర్ణాటక పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న కసితో ఉన్నారు. రెబల్ ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు బీజేపీ తన కనుసన్నల్లోనే ఉంచుకుంటుంది. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు రెబెల్ ఎమ్మెల్యేలకు హామీలు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించింది. ఈ నెల 16వ తేదీ వరకూ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రిసార్టుల్లోనే ఉంచే అవకాశాలున్నాయి

Related Posts