YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

మళ్లీ చైనా దురాక్రమణ

 మళ్లీ చైనా దురాక్రమణ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మరోసారి భారత భూభాగంలోకి చైనా ప్రవేశించింది.లఢఖ్ లోని భారత భూభాగంలోని 6 కిలోమీటర్ల వరకు చైనా దళాలు ప్రవేశించినట్లు సమాచారం. డోక్లామ్ లో భారత్-చైనా మధ్య ప్రతిష్ఠభన పరిష్కరించబడిన రెండు సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు చైనా తన దూకుడుతనాన్ని ప్రదర్శించి 6కిలోమీటర్లు భారత భూభాగంలోకి దూసుకొచ్చింది. తూర్పు డెమ్‌చోక్ ప్రాంతంలోని ఒక కొండపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కు చెందిన జెండా ఎగురవేసి ఉంది.డెమ్ చోక్ గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. చైనీయులు భారత భూభాగంలోకి ప్రవేశించి తమ జెండాను ఎగురవేసినట్లు ధృవీకరించారు. అయితే దీనికి సంబంధించి  ఇరుదేశాల వైపు నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు చైనా దళాలు ప్రవేశించిన ప్రాంతంలో ఇటీవల ప్రముఖ బౌద్దమత గురువు దలైలామా పుట్టినరోజు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే.

Related Posts