యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీకాళహస్తీశ్వరఆలయం అనుభంధమైన ద్రౌపదిసమేత దర్మరాజుల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘటనంగా జరిగయి. శనివారం అర్జున తపస్సు ఘట్టం రసవత్తరంగా సాగింది. మహాభారతంపర్వంలో పాండవులు అజ్ఞాతవాసం ముందు జువ్వీచెట్టుపై దాచిపెట్టిన వారి ఆయుధాలను తీసుకుంటారు. ఆసమయంలో అర్జునుడు వారి ఆయుధాలను తీసుకుని కౌరవుల పైకి యుద్దం వెళ్ళె ఘట్టాన్ని అర్జున తపస్సుమాన్ అంటారు. అర్జునుడు వేషధారి తాటిచెట్టు ఎక్కూతూ ఒక్కొక్క అడుగుకి పద్యాలు పాడుతు చెట్టుపైకి ఎక్కుతాడు. తరువాత భక్తులపై నిమ్మకాయలు విసురుతాడు. భక్తులు వాటిని తీసుకుని భక్తితో సేవించడంద్వారా సంతానం లేని భక్తులకు సంతానం కలుగుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.