YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చెన్నైకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటినతరలింపు

 చెన్నైకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటినతరలింపు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడు రాజధాని చెన్నైకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించే చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. గత ఆరు నెలలుగా ఎదుర్కొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రభుత్వం అందించే నీటి సరఫరాలో 40శాతం కోత పడింది. దీంతో అక్కడ తీవ్ర నీటి ఎద్దడి ప్రారంభమైంది. చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక రైళ్ల ద్వారా నగరానికి నీటిని తరలించే ఏర్పాట్లు చేసింది. అందుకోసం రోజుకు రూ.35లక్షలు కేటాయించింది. ప్రతిరోజు 10 మిలియన్‌ లీటర్ల నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు.చెన్నై రోజువారీ కనీస నీటి వినియోగం 525మిలియన్ లీటర్లు. ప్రస్తుతం ప్రభుత్వం తరలిస్తున్నది కేవలం 2శాతం మాత్రమే. కొంత స్థానికంగా సమకూర్చుకుంటున్నప్పటికీ.. ఇంకా లోటు భారీగా ఉంది. రైళ్ల ద్వారా తరలిస్తున్న నీరు కొంత ఉపశమనం మాత్రమేనని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తీవ్ర నీటి కొరతతో వాటర్‌ ట్యాంకర్ల యజమానులు ధరలు అమాంతం పెంచేశారు. నీటి కోసం గతంలో నెలకు రూ.2000 ఖర్చు పెట్టిన ప్రజలు ఇప్పుడు రూ.5000 ఖర్చుపెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.నగరానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని వేలూరు జిల్లా జోలారుపేట నుంచి కావేరి సహకార తాగునీటి పథకం నీటిని చెన్నైకి తరలించడానికి అక్కడి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం రూ.65 కోట్లు కేటాయించింది. శుక్రవారం ఉదయం జోలారుపేట నుంచి 2 ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించారు. 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 100 వ్యాగన్లు ఉన్న రెండు ర్యాక్‌ల ద్వారా మొత్తం 50 లక్షల లీటర్ల నీటిని తీసుకొచ్చారు. వీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేయనున్నారు. ఇలా రోజుకు కోటి లీటర్ల నీటిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Related Posts