YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజీ మార్గమే మేలు

రాజీ మార్గమే మేలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జాతీయ లోక్ అధాలత్ సందర్భంగా  పరిష్కరించిదగిన కేసులను రాజీ మార్గంద్వారా  పరిష్కరించేందుకు శనివారం జిల్లాలో 23 బెంచీల ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి గంధం సునీత చేప్పారు. స్ధానికి కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవాధికార  సంస్థ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా జడ్జి గంధం సునీత మాట్లాడుతూ గత విడతలో జిల్లాలో 1335 కేసులు పరిష్కరించడం జరిగిందని చెప్పారు. ఈ విడత 1966 పరిష్కరించదగిన కేసులు గుర్తించగా వాటిలో 1350 కు పైగా కేసులు పరిష్కరించాలని లక్ష్యంగా  నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సష్టపరిహారం, రాజీద్వారా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం ఇక్కడ 5 బెంచీలను ఏర్పాటుచేయిడం జరిగిందని కిక్షిధారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని గంధం సునిత కోరారు. ఎన్నోఏళ్ళగా పరిష్కారంకాని కేసులు  కేసులు రాజీమార్గం ధ్వారా పరిష్కరించుకుని  ఇరుపక్షాలవారు సంతోషంగా మనశ్సాంతిలో తిరిగి వెళ్ళాలని కోరారు. రెండవ అదనపు జిల్లా జడ్జి పి.ప్రభాకర్ మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించి ఇరుపక్షాలవారికి న్యాయం చేసి వారికి సంతోషాన్ని  ఇవ్వడమే మెగాలోక్ అధాలత్  ఉద్దేశ్యమన్నారు. ఎన్నో వేల కేసులు చాలా కాలంగా పెండింగ్ లో ఉంటున్నాయని, వాటికోసం ఇరుపక్షాలవారు కోర్టు వాయిధాలకు రావడం, సమయం, డబ్బు వృధాచేసుకోవడం జరుగుతోందని,  రెక్కాడితేగాని డొక్కాడని పేదప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి లోక్ అధాలత్ చాలా సహాయపడుతుందన్నారు. క్షణికావేశం, చెప్పుడుమాటలు వినడం, పంతాలు పట్టింపులు, చిన్నచిన్న కారణలకు కేసులు వేసుకుని శిక్షదారులు కొర్టుల చుట్టూ తిరుగున్నారని వారందరికీ లోక్  అధాలత్ మేలు చేస్తుందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన లోక్ అధాలత్ లో ప్రోనోట్ కు సంబంధిత పత్రాలను జిల్ఆ జడ్జి గందం సునీత కక్షిదారులకు  అందజేశారు. ఈ సమావేశంలో సుక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.శెలజ, ఫ్యామిలీ కోర్టు, 7వ అదనపు జిల్లా జడ్జి ఎస్ శారదా దేవి, జిపి కురెళ్ల జగన్మోహన్, బాలసుబ్రహ్యణ్యం, రమేష్ బాబు న్యాయవాధులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts