YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పురుషుడి కడుపులో గర్భసంచి.. ముంబయిలో అరుదైన ఘటన

పురుషుడి కడుపులో గర్భసంచి.. ముంబయిలో అరుదైన ఘటన

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆ వ్యక్తికి 29 ఏళ్లు. (పేరు గోప్యంగా ఉంచారు) పెళ్లయ్యి రెండేళ్లవుతున్నా సంతానం కలగడం లేదు. దీంతో అతడు ముంబయిలోని జేజే ఆసుపత్రిలో వైద్యులను ఆశ్రయించాడు. వైద్య పరీక్షల్లో అతడికి గర్భసంచి ఉన్నట్లు కనుగొన్నారు. అనంతరం లింగనిర్ధారణ పరీక్షలు జరిపి అతడు పురుషుడేనని తేల్చారు. గర్భసంచి స్త్రీలకు మాత్రం ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ముంబయిలో ఓ వ్యక్తి తమకు సంతానం కలగడం లేదని వైద్యులను ఆశ్రయిస్తే షాకింగ్ విషయం తెలిసింది. అతడి కడుపులో మహిళల తరహాలో గర్భసంచి ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. శస్త్ర చికిత్స చేసి ఆ గర్భసంచి తొలగించారు.  గర్భసంచి వల్ల వృషణాల వద్ద ఉండాల్సిన అండాశయాలు జీర్ణాశయానికి అతుక్కుని ఉండటాన్ని గుర్తించిన వైద్యులు అతడికి శస్త్రచికిత్స నిర్వహించారు, గర్భసంచిని తొలగించి అండాశయాలను వృషణాల వద్ద అమర్చారు.  ఈ ఆపరేషన్ అతడికి 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేయాలని, ఆలస్యం కావడం వల్ల అతడికి సంతాన సమస్యలు తప్పవని జేజే హాస్పిటల్ వైద్యులు అంటున్నారు. పురుషుల్లో గర్భసంచులు ఉండటం చాలా అరుదని, ఇప్పటివరకు ప్రపంచంలో 200 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ సమస్య ఉన్నవారి వీర్యంలో స్పెర్మ్ కౌంట్ సున్నా చూపిస్తుందని వివరించారు.

Related Posts