యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఓ యువకుడికి పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే గ్రామానికి చెందిన బోయ తలారిశ్రీనివాసులు, బోయ రంగమ్మ దంపతుల కుమారుడు బోయ తలారిగాంధీనాయుడు ఇతర కుటుంబసభ్యులతో కలిసి బతుకు తెరువు కొరకు ఇటీవల రైల్వే కోడూరుకు వెళ్లారు. అయితే తలారి గాంధీనాయుడు(21) తమ తల్లుదండ్రులు ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లిళ్లు కావట్లేదని ఆవేదనకు చెందేవాడు. మూడు రోజుల క్రితం తమ తల్లిదండ్రులకు చెప్పకుండా తమ సొంత గ్రామానికి చేరుకున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరులేని సమయంలో మనస్తాపానికి గురై ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నారు.