2020 జూన్ 30 కల్లా రేషన్ పోర్టబిలిటీని అమలు చేయడం ద్వారా పేదలు దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న కేంద్రం, అన్ని రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఒకసారి అన్ని రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం పూర్తయితే, అన్ని రాష్ట్రాల్లోని పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) యంత్రాల ద్వారా మాత్రమే ఆహార ధాన్యాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంటే దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌలభ్యం కలుగుతుంది. :