బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ కు నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న ఆరోపణలపై 2008లో శేఖర్ పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన ఏసీబీ, ఆరోపణలను నిజమేనని తేల్చి, కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆయన పేరిట తిరుపతి, ఎమ్మార్ పల్లి, మదనపల్లి తదితర ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నట్టు తెలిపింది. కేసును విచారించిన కోర్టు, జైలుశిక్ష, జరిమానా విధించింది. కాగా, గతంలో శేఖర్ పై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.