పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ జట్లు ఇప్పుడు ప్రపంచకప్‌లో లేవు. అతి కష్టం మీద సెమీస్ చేరిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లే ఫైనల్లో అడుగు పెట్టాయి. ఆదివారం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. ఫామ్, బలాబలాల్లో ఇంగ్లాండ్‌దే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. పైగా సొంతగడ్డపై ఆడుతుండటం సానుకూలాంశం. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను 119 పరుగుల తేడాతో ఓడించడం ఇంగ్లాండ్ విశ్వాసాన్ని పెంచేదే. అయితే సెమీస్‌లో భారత్‌కు షాకిచ్చిన కివీస్‌ను ఆ జట్టు తేలిగ్గా తీసుకోకూడదు.