మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరురాలు జయలక్ష్మి అత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, 2014 మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమె, ఆపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ ఉద్యోగాన్ని సంపాదించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తరువాత ఆమె రెండు ఉద్యోగాలపై పలువురు ఫిర్యాదులు చేయడంతో, ఆసుపత్రి ఉన్నతాధికారులు ఏదో ఓ ఉద్యోగాన్ని వదులుకోవాలని హెచ్చరించారు. దీంతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి చేసిన ఆమె, ప్రభుత్వం మారడంతో ఆశా కార్యకర్త ఉద్యోగం కూడా పోతుందన్న మనస్తాపంతో నిన్న మధ్యాహ్నం నిద్ర మాత్రలు మింగింది.