వన్డే ప్రపంచకప్ ఆఖరి పోరు ఆసక్తికరంగా సాగుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్, గత రన్నరప్ న్యూజిలాండ్ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్ల నష్టానికి 241 పరుగులే చేసింది. లియామ్ ప్లంకెట్ (3/42), క్రిస్‌వోక్స్ (3/37) భీకర స్పెల్‌తో ఆ జట్టును ఘోరంగా దెబ్బకొట్టారు. కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడంతో కివీస్ ప్రత్యర్థికి మోస్తరు లక్ష్యమే నిర్దేశించింది. హెన్రీ నికోల్స్ (55; 77 బంతుల్లో 4×4), టామ్ లేథమ్ (47; 56 బంతుల్లో 2×4, 1×6) రాణించారు.