YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ప్రమాదాలకు గురైన బస్సు,ఎయిర్ క్రాఫ్ట్ లు 

Highlights

  • డ్రైవర్ నిద్రమత్తే కారణమన్న పోలీసులు
  • ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డ ట్రావెల్ బస్సు
  • బుధవారం తెల్లవారుజామున ప్రమాదం
  •  బస్సులో 40 మంది ఐటీ ఉద్యోగులు
 ప్రమాదాలకు గురైన బస్సు,ఎయిర్ క్రాఫ్ట్ లు 

డ్రైవర్ల నిర్లక్ష్యానికి బస్సులే కాదు.. చివరికి ఎయిర్ క్రాఫ్ట్ కూడా గుద్దుకుంటున్నాయి.బుధవారం తెల్లవారుజామున వేర్వేరు ఘటనల్లో ఈ ప్రమాదాలు సంభవించాయి. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎయిర్వేస్ కు చేబడి ఓ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడి పార్కింగ్ బే వద్ద గుద్దుకుంది. మరో ఘాతకు వస్తే హైదరాబాద్ లో ట్రావెల్ బస్సు ఏకంగా ఫ్లై ఓవర్ మీద నుంచే కింద పడింది. మూసాపేటలోని  ఫ్లైఓవర్  ఓవర్ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కధనం ప్రకారం .. మాదాపూర్ లోని ఐటీ కంపెనీ సెయింట్‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగులను  తీసుకు వెళుతున్న సోని ట్రావెల్స్‌ కు చెందిన బస్సు  (ఏపీ 28 టీఏ 7676), అమీర్ పేట నుంచి చింతల్ వైపు వెళ్తూ, రెయిలింగ్ ను, డివైడర్ ను ఢీకొట్టి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ఉద్యోగులు ఉండగా, బస్సు సుమారు 7 అడుగుల పైనుంచి కింద పడింది.ఫ్లైఓవర్ మొదట్లోనే ప్రమాదం జరగడంతో ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తుకు తోడు, రాంగ్ రూట్ లో వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని, ఎడమవైపు నుంచి వెళ్లాల్సిన బస్సు, కుడివైపు పడిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని అన్నారు.

1 injured after bus carrying 50 ppl fell down from a flyover in Cyberabad, Hyderabad earlier today;driver was passing through Bharat Nagar bridge when he fell unconscious due to ill health&drove ahead on wrong route.Bus was hanging on flyover's edge when all passengers jumped out pic.twitter.com/sQZDTwQzAr

— ANI (@ANI) March 7, 2018

Related Posts