ఆశలను నిజం చేసుకుంటూ ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆదివారం నరాలు తెగే ఉత్కంఠమధ్య అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. నికోల్స్ (55; 77 బంతుల్లో 4×4), లేథమ్ (47; 56 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో మొదట న్యూజిలాండ్ 8 వికెట్లకు 241 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (84 నాటౌట్; 98 బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్ మ్యాచ్‌ను టై చేసింది. 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్ కూడా టైగా ముగియగా.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.