YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజధానిపై జగన్...

 రాజధానిపై జగన్...

నవ్యాంధ్రకు రాజధాని లేదు. అయిదేళ్ళ క్రితం దారుణంగా విడగొట్టేశారు. అది కూడా ఏపీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా చేశారు. ఒక రాజాధాని ప్రాంతం ఉన్న వారు విడిపోతామని అడగడం ఇదే ప్రధమమైతే వారికి అలా రాజధాని ఇచ్చేసి తలకాయ లేని మొండేన్ని వేరే ప్రాంతానికి ఇవ్వడం కూడా ఇదే తొలిసారి. అయిదేళ్ళు గడచినా ఏపీకి రాజధాని అన్నది లేదు. అమరావతి, భ్రమరావతి పేరు చెప్పి చంద్రబాబు చందమామ కధలే వినిపించారు. అప్పట్లో కేంద్రం కేవలం 1600 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. రెండు లక్షల కోట్లు ఉంటేనే రాజధాని పూర్తి అవుతుందని నిన్నటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ బడ్జెట్ లెక్కలు చెప్పారు. 33 వేల ఎకరాల రైతుల భూమిలో రాజధాని నిర్మాణం అంటే రాత్రికి రాత్రి జరిగేది కాదు, అలాగని ఊరుకోకుండా నిధులను కేటాయిస్తూ పోతే కొంతలో కొంత అయినా నిర్మాణం జరుగుతూ ఉంటొంది. అయితే జగన్ సర్కార్ తొలి బడ్జెట్లో అమరావతి రాజధానికి కేటాయించింది కేవలం అయిదు వందల కోట్ల రూపాయలే. మరి ఇది ఏ మూలకు సరిపోతుదని అపుడే తమ్ముళ్లు దీర్ఘాలు తీస్తున్నారు.అమరావతి రజధాని నిర్మాణం పూర్తి కావాలంటే వేల కోట్లలోనే కేటాయింపులు ఉండాలి. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం వందల కోట్లలోనే డబ్బులు విదిలించింది. మరి అమరావతి అన్నది ఎపుడు పూర్తి అవుతుందన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇంకో వైపు చూస్తే కేంద్రం సైతం అమరావతి నిర్మాణానికి ఉదారంగా నిధులను కేటాయించేందుకు సిధ్ధంగాలేదు. అసలు కేంద్ర బడ్జెట్లో ఏపీ వూసే లేదు. ఏదైనా కేటాయింపు జరిపితే అందులోనే అన్నీ చూసుకోమనేలా కేంద్ర పెద్దలు ఉన్నారు. ఆ విధంగా ఆలోచించినపుడు అమరావతి నిర్మాణం అన్నది రెండిటికీ చెడిన రేవడిలా మారిందా అన్న సందేహాలు వస్తున్నాయి.జగన్ అమరావతిలో భారీ నిర్మాణాల పట్ల మొదటి నుంచి విముఖంగా ఉంటున్నారు. అసలు అంత పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములను సేకరించడాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నారు. రాజధాని అమరావతి అన్నది అందరికీ అందుబాటులో ఉండాలని, కొందరికే పరిమితం కారాదన్నది ఆయన వాదన. ఆ విధంగా చూసుకుంటే అమరావతి పేరు మీద ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్ విపక్ష నేతగా ఉన్నపుడే ఆరోపణలు చేశారు. ఇపుడు ఆయన అటువంటి అమరావతికి తన వంతుగా నారూ నీరూ పోస్తారా. అందువల్లనే జగన్ అరకొర నిధులే ఇచ్చారని అంటున్నారు. పైగా అధికార వికేంద్రీకరణ చేయాలన్నది జగన్ విధానమని, హైదరాబాద్ తరహాలో ఒకే చోట అన్నీ ఇచ్చేస్తే మొత్తం పదమూడు జిల్లాల్లో సమగ్ర అభివ్రుధ్ధి జరగదని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ కారణం వల్లనే అమరావతికి కేటాయింపులు కుందించారని తెలుస్తోంది. ముందు ముందు అమరావతి విషయంలోమరింతగా జగన్ సర్కార్ ఆలోచనలు తేటతెల్లమవుతాయి.

Related Posts