యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాష్ట్రాల వారీగా పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ నాయకత్వం యూపీ పగ్గాలు అప్పగించింది. మొత్తం యూపీ కాంగ్రెస్ ను పియాంక నడిపించనుంది. యూపీలోని 12 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరుగనుండంతో పార్టీని పునరుద్ధరించాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 స్ధానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒక్క స్ధానాన్నే కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీ సైతం అమేథిలో ఓటమి పాలయ్యారు. యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పోటీచేసిన రాయ్‌బరేలి స్ధానాన్ని మాత్రమే కాంగ్రెస్ దక్కించుకోగలిగింది. యూపీలో కాంగ్రెస్ ఘోర వైఫల్యంపై ప్రియాంక గాంధీ, వెస్ట్ యూపీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియా పలుమార్లు సమీక్షా సమావేశాలు జరిపారు.అనంతరం పార్టీ యూపీ విభాగంలో భారీ మార్పులు తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఆ క్రమంలోనే ఇటీవల యూపీలోని అన్ని జిల్లా కమిటీలను రద్దు చేశారు.