YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ప్రపంచ కప్ ఫైనల్స్ వివాదంగా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయం

 ప్రపంచ కప్ ఫైనల్స్ వివాదంగా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయం

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన వన్డే ప్రపంచకఫ్ ఫైనల్ మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్లు తప్పిదానికి పాల్పడ్డారు. ఇంగ్లాండ్ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు  అవసరమైన దశలో బంతిని మిడ్ వికెట్ దిశగా తరలించిన బెన్స్టోక్స్.. రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో.. కీపర్ ఎండ్ వైపు బంతి గప్తిల్ త్రో చేయగా.. అప్పుడే క్రీజులోకి వచ్చేందుకు డైవ్  చేసిన బెన్స్టోక్స్ బ్యాట్కి తాకి బౌండరీకి వెళ్లిపోయింది. దీంతో.. సహచర ఫీల్డ్ అంపైర్ తో చర్చించిన ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన.. ఇంగ్లాండ్ ఖాతాలో 2+4 (ఓవర్ త్రో) ఆరు పరుగులు చేర్చాడు. ఈ మ్యాచ్ కి ఆఖరికి టైగా ముగియగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. అక్కడా టై కావడంతో.. చివరిగా మ్యాచ్లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ టీమ్ని విజేతగా ప్రకటించారు. వాస్తవానికి రూల్స్ ప్రకారం ఇంగ్లాండ్ టీమ్కి ఫీల్డ్ అంపైర్లు ఇవ్వాల్సింది ఐదు పరుగులుకాగా.. ఒక పరుగు అదనంగా ఇచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐసీసీ 19.8 క్లాజ్ని ప్రస్తావిస్తున్న క్రికెట్ పండితులు..  బెన్స్టోక్స్ రెండో పరుగు పూర్తి చేయకమునుపే ఓవర్త్రో విసిరారు కాబట్టి.. ఆ రెండో పరుగుని లెక్కలోకి తీసుకుని ఉండకూడదంటూ చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఆ నాలుగు పరుగులు ఇంగ్లాండ్ ఖాతాలో  చేకపోయి ఉండింటే..? మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచేదేమో..! రనౌట్ నుంచి తప్పించుకునేందుకు డైవ్ చేసే క్రమంలో తన ప్రమేయం లేకుండానే బ్యాట్కి బంతి తాకినా.. జీవితకాలం న్యూజిలాండ్కి తాను  క్షమాపణలు చెప్తుంటానని మ్యాచ్ తర్వాత బెన్స్టోక్స్ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. అంతలా.. ఆ ఓవర్త్రో న్యూజిలాండ్ విజయావకాశాల్ని ప్రభావితం చేసింది. 

Related Posts