Highlights
కారణం గ్లోబల్ మార్కెట్లే
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థిటికి గ్లోబల్ మార్కెట్లే కారణమంటున్నారు. వైట్‌హౌజ్ వాణిజ్య ట్రేడ్‌కు చెందిన కీలక అధికారి, ఎకనామిక్ అడ్వియజరీ గ్యారీ కోన్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో గ్లోబల్ స్టాక్స్ కుప్పకూలాయి. ఫలితంగా ట్రేడ్ వార్ ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 100 పాయింట్ల మేర కిందకి పడిపోయింది. ప్రస్తుతం 58 పాయింట్ల నష్టంలో 32,259 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంలో 10,222 వద్ద కొనసాగుతోంది.ప్రపంచ మార్కెట్ల ఆందోళనలతో పాటు, దేశీయంగా కూడా సెంటిమెంట్ బలహీనంగా ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.