YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వైఫై ఒక్కసారి నమోదైతే... దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడొచ్చు

వైఫై ఒక్కసారి నమోదైతే... దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడొచ్చు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 

వైఫైని ఉపయోగించే వారికిది శుభవార్తే. సదరు వైఫైతో అనుసంధానమయ్యేందుకు వ్యక్తిగత వివరాలను ఒకసారి నమోదు చేసుకుంటే చాలు, పదేపదే ప్రతిసారీ మొబైల్‌ ఫోన్‌లో సమాచారన్నంతా నింపాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడైనా వైఫైని ఉపయోగించుకోవచ్చు. ఈ వెసులుబాటును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఒక మొబైల్‌ వినియోగదారుడు ఒకసారి తన వివరాలతో వైఫైకి అనుసంధానమైతే.. తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో వంటి అన్ని నెట్‌వర్క్‌లూ సదరు ఉపకరణాన్ని గుర్తించి అనుసంధానమవుతాయని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

Related Posts