అభివృద్ధిలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కు పోలికేలేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. వ్యాఖ్యలు బాధాకరమన్న ఆయన తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారన్న వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995కు ముందు.. తరువాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. విభజనలో యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్నామని.. ఇంకా రూ.35వేల ఆదాయం పెరిగితేనే పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయికి చేరుకోగలమని పేర్కొన్నారు.