యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే 'భారతీయుడు 2' చిత్రం తొలి షెడ్యూల్ తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడుకి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారికి బడ్జెట్టు విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో ఇది ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. ఇటీవల వీరు కూర్చుని మాట్లాడుకున్నారని, పరిమితమైన బడ్జెట్టులో పూర్తి చేయడానికి దర్శకుడు అంగీకరించాడనీ, ఆగస్టు నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందని తాజా సమాచారం