YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోచ్‌.. సహాయ సిబ్బంది కోసం దరఖాస్తులు విడుదల చేయనున్న బీసీసీఐ

 కోచ్‌.. సహాయ సిబ్బంది కోసం దరఖాస్తులు విడుదల చేయనున్న బీసీసీఐ

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

 వన్డే ప్రపంచ కప్ లో ఓటమి తరువాత  భారత్ ఘోర విమర్శలు ఎదుర్కుంటుంది.. బీసీసీఐ టీమ్   మానేజ్మెంట్ ఫై చాల కోపం గ ఉంది.. తాజాగా బీసీసీఐ కోచ్‌ అన్వేషణలో పడింది.  టీమిండియా హెడ్‌ కోచ్‌, సహాయ సిబ్బంది కోసం దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ త్వరలో ఓ ప్రకటన విడుదల చేయనుంది. వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్‌ టూర్‌తో కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ ముగియనుంది. ఒకవేళ శాస్త్రి కోచ్‌గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే. వాస్తవంగా వరల్డ్‌క్‌పతో రవి కాంట్రాక్ట్‌ ముగిసింది. కానీ, విండీస్‌ టూర్‌ను దృష్టిలో ఉంచుకొని శాస్త్రితోపాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ల కాంట్రాక్ట్‌ను మరో 45 రోజులు పొడిగించారు. వరల్డ్‌కప్‌ వైఫల్యం నేపథ్యంలో ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసు తప్పుకొన్నారు. సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఆలోపే కోచ్‌ను ఎంపికచేయాలని బీసీసీఐ నిర్ణయించింది. కోచ్‌లతోపాటు టీమ్‌ మేనేజర్‌ పోస్టుకు కూడా దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Related Posts