YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తెరాస ప్లీనరీలో 'థర్డ్ ఫ్రెంట్' భేరీ

Highlights

  • తెరాస తరహాలోనే..
  • జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానం 
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం 
తెరాస ప్లీనరీలో 'థర్డ్ ఫ్రెంట్' భేరీ

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు సంకల్పంతో  'థర్డ్ ఫ్రెంట్' కి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర రావు శ్రీకారం చుట్టేందుకు సర్వసన్నర్ధమయ్యారు. ప్రత్యేక తెలంగా నినాదంతో ప్రాంతీయ పార్టీగా అవతరించిన టీఆరెస్ ను వేదికగా చేసుకున్నట్టు తెస్తుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ నెలలో జరగనున్న పార్టీ ప్లీనరీ నుంచి   కొత్త రాజకీయ కూటమికి శంఖారావం పూరించనున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఏర్పాటు చేయబోయే ఈ తృతీయ కూటమి ప్రారంభోత్సవ వేడుకకు  జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి అనుగుణంగా తెరాస కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రతిఏటా ఏప్రిల్‌ నెలలో తెరాస ప్లీనరీని నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భావదినమైన ఏప్రిల్‌ 27కి కొంత ముందు, వెనకా తేదీల్లో వీటిని నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్లీనరీ ఘనంగా జరిగింది. ఈసారి కొత్త పరిణామాల నేపథ్యంలో ప్లీనరీ సమావేశాన్ని తమ వ్యూహానికి అనుగుణంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు.
తెరాస పార్లమెంటరీ పార్టీ వేదికగా ప్రత్యామ్నాయ కూటమి ఆకాంక్షను  వెల్లడించిన కేసీఆర్‌ దీనికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్‌గఢ్‌ మొదటి ముఖ్యమంత్రి, రాష్ట్ర జనతా కాంగ్రెస్‌ నేత అజిత్‌ జోగి, మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తదితరులు మద్దతు ప్రకటించారు. జాతీయ స్థాయిలో నేతలు, వివిధ వర్గాల ప్రముఖులు, మేధావులు, విశ్రాంత అధికారులను కలిసేందుకు దేశరాజధాని దిల్లీ సహా ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈనెల 12వతేదీ నుంచి నెలాఖరు వరకు శాసనసభ సమావేశాలున్నాయి. తర్వాత ఆయన కూటమిపై దృష్టి సారించనున్నారు. ముందుగా ప్లీనరీని నిర్వహించి, దాన్నుంచే తన సందేశం వినిపించాలని భావిస్తున్నారు. భావసారూప్యత గల పార్టీలతో పాటు తమ మద్దతుదారులైన మమత, ఇతర జాతీయస్థాయి నేతలను, ప్రాంతీయ పార్టీల ప్రముఖులను ముఖ్యమంత్రి ఆహ్వానిస్తారు. హైదరాబాద్‌ అనుకూలంగా ఉన్నందున ఇక్కడే ప్లీనరీని జరుపుతారు. తెరాస ఆవిర్భావ నిర్ణయాన్ని హైదరాబాద్‌లోనే తీసుకుని ప్రకటించిన సీఎం కేసీఆర్‌, ఇదే తరహాలో హైదరాబాద్‌ నుంచే కూటమి స్వరూపాన్ని ప్రకటించి, తమ వాణిని వినిపించడం ద్వారా కలసి వస్తుందనే భావనతో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో మంగళవారం సమావేశమై కూటమి అంశాలపై చర్చించారు. జాతీయస్థాయిలో పార్టీ సమన్వయకర్తల నియామకాల కోసం ఆయన కసరత్తు చేసినట్లు తెలిసింది. పార్టీ ఎంపీలకు ఈ బాధ్యతలు అప్పగించారు.

Related Posts