YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ సహా పలు దేశాల్లో కనువిందుచేసిన చంద్రగ్రహణం.

భారత్ సహా పలు దేశాల్లో కనువిందుచేసిన చంద్రగ్రహణం.

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం జులై 16న మంగళవారం అర్ధరాత్రి ఏర్పడింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఈ గ్రహణం స్పష్టంగా కనిపించింది. పాక్షిక చంద్రగ్రహణం దాదాపు 150 ఏళ్ల తర్వాత మళ్లీ గురు పూర్ణిమ రోజున సంభవించడం విశేషం. ఖండగ్రాస కేతు గ్రస్త చంద్రగ్రహణం మంగళవారం అర్ధరాత్రి 1.31 ధనుస్సు రాశి ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదంలో ప్రారంభమై తెల్లవారుజామున 4.30 నిమిషాలకు మకర రాశి ఉత్తరాషాడ రెండో పాదంలో ముగిసింది. మొత్తం 178 నిమిషాలపాటు ఈ గ్రహణం కనువిందు చేసింది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికాల్లోనూ ఈ పాక్షిక చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆసియాలోని మారుమూల ఈశాన్య ప్రాంతాలు, ఐరోపాలో స్కాండినేవియాలోని మారుమూల ఉత్తర ప్రాంతాలు మినహా దక్షిణ అమెరికాలోని పలుచోట్ల గ్రహణం కనువిందు చేస్తుంది. భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించే అరుదైన దృశ్యం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఉత్తర మరియ దక్షిణ కొరియా, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, ఉభయ చైనాలోని దక్షిణ మారుమూల ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించడం విశేషం. అలాగే అర్జెంటీనా, చిలీ, బొలీవియా, పెరూ, దక్షిణ అట్లాంటిక్ సముద్రం, బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాలలో గ్రహణం ముగిసి చంద్రుడు ఉదయించే అద్భుత దృశ్యాన్ని వీక్షించారు.

Related Posts